జగన్ సీఎం కావాలని యువకుడి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి...

బుధవారం, 15 నవంబరు 2017 (10:50 IST)

ys jagan

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈనాటికి తొమ్మిదో రోజుకు చేరింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ''ప్రజా సంకల్ప యాత్ర" వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా రాజుపాలెం మండలం టంగుటూరుకు చెందిన కాచన శ్రీనివాసులురెడ్డి వైసీపీ చీఫ్ జగన్‌కు వీరాభిమాని. ఇతడు సోమవారం టంగుటూరు మెట్ట వద్ద జగన్ నిర్వహించిన పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నాడు. 
 
రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఉదయం జగన్ సీఎం కావాలని సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృతితో రాజుపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పలువురు నేతలు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా కడప జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Jagan Fan Padayatra Tangutur Suicide Kadapa

Loading comments ...

తెలుగు వార్తలు

news

అస్సోంలో రూ.121 కోట్ల ప్రింటింగ్ స్కామ్ : ఐఏఎస్‌ అధికారి అరెస్టు

అస్సోంలో రూ.121 కోట్ల ప్రింటింగ్ స్కామ్‌లో ఓ ఐఏఎస్‌ అధికారిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు ...

news

నార్త్ కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు... ఐదుగురు మృతి

అమెరికాలోని మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంకో టెహనాలోని ఓ ...

news

సముద్రంపై తేలియాడే నగరం.. వ్యవసాయం చేస్తారట.. ఎక్కడ?

ఫ్రాన్స్ సర్కారు అద్భుత సృష్టితో తమ సత్తా ఏంటో నిరూపించురోనుంది. సరికొత్త రూ. 1135కోట్లతో ...

news

ఆ స్కూల్‌లో తుమ్మితే రూ.200, తమిళం మాట్లాడితే రూ.300 ఫైన్.. ఎక్కడ?

దేశంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల తీరు తమ ఇష్టారాజ్యంగా ఉంది. తాము చెప్పిందే ...