Widgets Magazine

చిరు ఫ్లెక్సీ ముందు వీరాభిమాని పెళ్లి... దంపతులకు 'మెగా' సర్‌ప్రైజ్

ఆదివారం, 12 నవంబరు 2017 (08:40 IST)

Widgets Magazine
chiru fan

తమకు నచ్చిన హీరోల కోసం అభిమానులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరు. అలాగే, తమ జీవితంలో జరిగే అరుదైన మధుర ఘట్టాలను సైతం వారి కటౌట్లు, ఫ్లెక్సీల ముందుపెట్టి జరుపుకుంటుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా జరిగింది. 
 
ఇటీవల ఈస్ట్ గోదావరి జిల్లా కడియాపు అనే గ్రామానికి చెందిన ఆకుల భాస్కరరావు అనే చిరు వీరాభిమాని మెగాస్టార్ చిరంజీవి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, దాని ముందు కూర్చుని తన వివాహాన్ని చేసుకున్నాడు. ఈ విషయం సామాజికమాధ్యమాల్లో వైరల్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ వీరాభిమాని దంపతులకు చిరంజీవి మెగా సర్‌ప్రైజ్ ఇచ్చారు. 
 
ఆ నూతన దంపతులను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి.. వారితో కలసి భోజనం చేశారు. అంతేకాదు, నవదంపతులకు కొత్త దుస్తులను కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. తాను అభిమానించే నటుడే స్వయంగా తమను ఆహ్వానించి.. విందు ఇవ్వడంతో ఆ వీరాభిమాని ఆనందానికి హద్దులు లేవు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి.
chiru fanWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా వయస్సు పెరిగిందా.. ఏం మాట్లాడుతున్నారు.. కాజల్ అగర్వాల్ ఫైర్

మూడు పదుల వయస్సు పెరిగిందా నాకు.. ఏం మాట్లాడుతున్నారు మీరు. నన్ను చూస్తే అలా ...

news

ఉర్రూతలూగించిన 'బావలు సయ్యా...' గాయని ఇకలేరు...

సిల్క్ స్మిత బావలు సయ్యా... పాట అంటే అప్పట్లో కుర్రకారు వెర్రెక్కిపోయేవారు. సుమన్, ...

news

తిరుమల శ్రీవారి ఆలయం ముందు దీపికా పదుకొణే ఏం చేసిందంటే...(వీడియో)

బాలీవుడ్ సినిమాల్లో దీపికా పదుకొణే అగ్ర హీరోయిన్. అగ్రహీరోల నుంచి యువ హీరోల వరకు ...

news

అరమ్‌తో నయనతార లేడి సూపర్ స్టార్ కావడం ఖాయమేనా?

దక్షిణాది హీరోయిన్ నయనతార లేడి సూపర్ స్టార్ కావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. నయన ...