గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (20:44 IST)

ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏపీ సీఎం జగన్

jagan ys
ఏపీ సీఎం జగన్‌కు ఈరోజు ప్రమాదం తప్పింది. కడప జిల్లా వేముల మండలంలో వైసీపీ నేతలతో సమీక్ష ముగించుకుని సీఎం జగన్ ఇడుపులపాయకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌లోని ఓ కారు అదుపు తప్పింది. 
 
ఆ కారు సీఎం జగన్ కారును ఢీకొనడంతో... జగన్ కారు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో సీఎం జగన్ కారు కూడా అదుపు తప్పి కాన్వాయ్‌లోని రెండు మూడు కార్లను ఢీకొట్టింది. ఆయా కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. 
 
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సీఎం జగన్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం సీఎం జగన్‌ మరో కారులో బయలుదేరారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో సీఎం జగన్‌కు ముప్పు తప్పిందని భావిస్తున్నారు.
 
 గత రెండు రోజులుగా అన్నమయ్య, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించారు. ఈరోజు కూడా కడప జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లకు ప్రారంభమయ్యాయి.