Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అయ్యా మీకు దండం... మోటారు బైకుపై ఐదుగురా...

సోమవారం, 9 అక్టోబరు 2017 (20:51 IST)

Widgets Magazine

చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణం అతి వేగంతో పాటు మితిమీరిన ప్రయాణికులతో వాహనాన్ని నడపడం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల విషయంలో అయితే ఇక వేరే చెప్పక్కర్లేదు. మోటారు బైకుపై ఎంతమంది వీలుంటే అంతమందిని కూర్చోబెట్టుకుని కొందరు మొండి ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోవడం జరుగుతుంటుంది. వీటిని ఆపేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నా దున్నపోతు మీద వాన కురిసినట్లే అవుతుంది. 
SI Namaskar
 
ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించవద్దు బాబోయ్ అని పోలీసులు మొత్తుకుంటున్నా వింటున్నవారు బహు కొద్దిమందే. ఇక హెల్మెట్ విషయం వేరే చెప్పక్కర్లేదు. పోలీసులను అంత దూరంలో చూసి హెల్మెట్ తీసుకుని తగిలించుకుంటారు. అదే పోలీసులు ఎవరూ లేరని నిర్థారణ అయితే హెల్మెట్ తీసి మోటారు సైకిల్ ఇంజిన్ బాక్సుపై పెట్టేసి నడిపేస్తుంటారు. 
 
ఇలాంటివారిని ఏం చేయాలో ఆ సబ్ ఇన్ స్పెక్టరుకు అర్థంకాక ఇలా ఏకంగా దండమే పెట్టేశారు. ఐదుగురితో ద్విచక్ర వాహనంపై అనంతపురంలో వెళుతున్న ఓ వాహన చోదకుడిని ఆపి మరీ  శుభ‌కుమార్ అనే ఇన్స్‌పెక్ట‌ర్ వారికి దండం పెట్టేసి, ఇలా ప్ర‌యాణిస్తే ఎలా అయ్యా ప్రశ్నించాడు. ఆ ఫోటో ఇప్పుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసైనా అలాంటి ద్విచక్ర వాహనదారుల్లో చైతన్యం వస్తుందేమో?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

త్వరలో సుందర నగరంగా నంద్యాల... భూమా బ్రహ్మానందరెడ్డి

కర్నూలు జిల్లాలోని నంద్యాలను త్వరలో సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఉప ఎన్నికల్లో విజయం ...

news

తిరుపతిలో నడిరోడ్డుపై వ్యక్తి హత్య (వీడియో)

తిరుపతిలో పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా నరికిచంపారు గుర్తుతెలియని ...

news

చేతిలో చిల్లిగవ్వ లేదు... జరిమానా ఎలా కట్టాలి : డేరా బాబా

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ జైలుశిక్ష ...

news

రేప్ చేశాడు.. ఇల్లును రాయించుకున్నాడు : తెలంగాణ మహిళ ఫిర్యాదు

ఢిల్లీలో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురికావడమేకాకుండా, ఆస్తి ...

Widgets Magazine