పెళ్లాడుతానని మోసం చేశాడు... యువతి మౌనపోరాటం(Video)

couple
శ్రీ| Last Modified మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (19:59 IST)
ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి అతడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని యువతి భాగ్యలక్ష్మి ధర్నా చేసింది.

పెళ్ళి చేసుకోవాలని అడుగుతుంటే జోసెఫ్ మొహం చాటేస్తున్నాడని బాధిత మహిళ ఆందోళన చేస్తోంది. తనకు న్యాయం జరగకపోతే జోసఫ్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు చెపుతోంది.

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆరోపిస్తోంది.
స్థానిక మహిళల సహకారంతో అతడి ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. వీడియో చూడండి.దీనిపై మరింత చదవండి :