Widgets Magazine

ఇషా రెబ్బావా? ఐతే మాకేంటి? ఈసారి కార్డు తీసుకుని వస్తేనే శ్రీవారి దర్శనం...

మంగళవారం, 13 మార్చి 2018 (15:03 IST)

Widgets Magazine

ఇషా రెబ్బా ఎవరబ్బా అని ఆశ్చర్యపోకండి. అంతకు ముందు ఆ తరువాత, అమీ తుమీ సినిమాల్లో నటించింది ఇషా రెబ్బా. తిరుమల శ్రీవారి దర్శనార్థం తొలిసారి వచ్చిన ఈ హీరోయిన్‌కు తీవ్ర అవమానమే జరిగింది. సినీ నటులందరికీ ఫిల్మ్ అసోసియేషన్ తరుపున ఐడెంటీ కార్డు ఇస్తారు. ఆ ఐడెంటీ కార్డును జిరాక్స్ తీసుకుని తిరుమలలోని జెఈఓ కార్యాలయంలో దర్శనం కోసం ధరఖాస్తు చేసుకోవాలి. కానీ ఇషా రెబ్బాకు ఆ ఐడీ కార్డు లేదు. కేవలం ఆధార్ కార్డు మాత్రమే ఉంది. 
Isha Rebba
 
సెల్ఫ్ పేరుతో ఆమె ఒక్కరే దర్శనానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టిటిడి ఆమె లెటర్‌ను పక్కన పడేసింది. దర్సనానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఏం చేయాలో పాలుపోక కొంతమంది టిటిడి ఉద్యోగుల సలహాతో చివరకు ఇషా రెబ్బా స్వయంగా జెఈఓ శ్రీనివాసరాజుకు ఫోన్ చేసి తనకు ఇంకా ఫిల్మ్ అసోసియేషన్ నుంచి ఐడీ కార్డు రాలేదని, తాను తిరుమలలో ఉన్నానని, దర్శనానికి అనుమతినివ్వాలని కోరింది. దీంతో జెఈఓ ఆమె గురించి తెలుసుకుని ఆ తరువాత దర్శనానికి అనుమతించారు. మరోసారి ఐడీ కార్డుతో వస్తేనే తిరుమల శ్రీవారి దర్శనానికి పంపిస్తామని తేల్చి చెప్పారు తిరుమల జెఈఓ.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిజ‌మైన పోలీస్.. పుదుచ్చేరి పోలీస్ అంటోన్న కిర‌ణ్ బేడీ

మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ.. ఇటీవ‌ల కాలంలో త‌న ...

news

పోలవరం ప్రాజెక్ట్ పైన చంద్ర‌బాబు స‌మీక్ష‌

పోల‌వ‌రంతో స‌హా ప్రాధాన్య ప్రాజెక్టులపై అధికారుల‌తో చంద్ర‌బాబు నాయుడు స‌మీక్షా స‌మావేశం ...

news

దక్షిణాది సొమ్ముతో ఉత్తరాదికి సోకులు : దక్షిణాది సెంటిమెంట్‌ లేవనెత్తిన చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు ...

news

జయా బచ్చన్ ఆస్తుల విలువ రూ.1000 కోట్లు... వాచ్‌ల విలువ రూ.3.4 కోట్లు!

బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ సతీమణి జయా బచ్చన్. ఈమె రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ...