మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (10:29 IST)

నీచ కులానికి చెందిన మోడీ దేశాన్ని పాలిస్తున్నారు.. నోరు జారిన వీర్రాజు

భారతీయ జనతా పార్టీకి చెందిన ఏపీకి చెందిన శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు నోరుజారారు. అదీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై. ప్రధాని మోడీపై ఏపీకి చెందిన టీడీపీ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టే సమయంలో

భారతీయ జనతా పార్టీకి చెందిన ఏపీకి చెందిన శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు నోరుజారారు. అదీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై. ప్రధాని మోడీపై ఏపీకి చెందిన టీడీపీ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టే సమయంలో ఆయన నోరు జారారు. 
 
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిపై సోము వీర్రాజు స్పందిస్తూ, బీసీ వర్గానికి చెందిన ప్రధాని, నీచ కులానికి, గాండ్ల కులానికి చెందిన మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని.. ఆయనపై విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పా టు చేయడం బాధాకరమన్నారు. 
 
దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఒక కులాన్ని నీచ కులమని ఎలా సంభోదిస్తారని నిలదీశారు. వీర్రాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సూచించారు. మోడీది నీచకులమని కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యానించారని, దానినే తాను గుర్తుచేశానని వీర్రాజు చెప్పారు. 
 
బీజేపీకి చెందిన ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై ఇతర బీజేపీ నేతలు సైతం ఆయనపై మండిపడుతున్నారు. ప్రత్యర్థులు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలంటూ హితవు పలుకుతున్నారు.