ఆకాశవాణి చిన్నమ్మ ఇకలేరు...

chinnamma
Last Updated: శుక్రవారం, 18 జనవరి 2019 (09:48 IST)
ఆకాశవాణి చిన్నమ్మ ఇకలేరు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి రోజూ ప్రసారమయ్యే 'పాడి-పంట' కార్యక్రమంలో చిన్నమ్మగా శ్రోతలను పలుకరించిన నిర్మలా వసంత్ అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆమె వయసు 73 సంవత్సరాలు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె... ఈ నెల 8వ తేదీన ఆకాశవాణి కేంద్రంలో జరిగిన పూర్వఉద్యోగుల ఆత్మీయసమ్మేళనంలో చివరిసారిగా పాల్గొన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె కుటుంబం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కడప జిల్లాలో స్థిరపడ్డారు.

హైదరాబాద్‌కు చెందిన వసంత్‌తో వివాహం జరిగిన అనంతరం ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. నిర్మల భర్త నిజాం కాలేజీలో ఇంగ్లీషు విభాగంలో పని చేశారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. పల్లెటూరి అమాయక మహిళా రైతుల సందేహాలను తన గొంతులో వినిపిస్తూ, పెద్దయ్య ద్వారా సమాధానాలు రాబడుతూ అందరినీ మెప్పించారు. వ్యవసాయ విభాగానికి కొండంత అండగా చిన్నమ్మ తన సేవలు అందించారు.దీనిపై మరింత చదవండి :