సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (18:00 IST)

ఏం చేసినా జగన్‌ను ఓడించలేరు.. అంబటి రాంబాబు

ambati
ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మంత్రి అంబటి స్పష్టం చేశారు. అటు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. 
 
పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వనంటాడు.. బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు.. ఒకసారి మూడు ఆప్షన్లు ఉన్నాయంటారు.. మరోసారి ప్రజలతోనే పొత్తు అంటారు అంటూ చురకలు అంటించారు.
 
రహస్య మిత్రుడు చంద్రబాబుతో ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను పవన్ కళ్యాణ్ ఓడించలేరని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. 
 
వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరన్నారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇప్పటివరకు లక్షా యాభై వేల కోట్ల నిధులు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో చేరాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.