గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (12:23 IST)

27న అమ్మఒడి పథకం నిధులు విడుదల

ys jagan
ఏపీలో వైకాపా జగన్ అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. 
 
వారికి ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇస్తున్నారు. అయితే, అమ్మఒడి సాయంలో ఈ ఏడాది మాత్రం లబ్ధిదారులందరికీ రూ.2వేలు కోత పడుతోంది.
 
ఈ నేపథ్యంలో ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ స‌ర్కారు శుభ‌వార్త తెలిపింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. 
 
అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 కోట్లు కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికిపైగా కోత పెట్టింది.