అశ్లీల చిత్రాలు చూడమని వేధించడంతో... భర్తను కడతేర్చిన భార్య

కట్టుకున్న భర్తను ఓ భార్య కడతేర్చింది. దీనికి కారణం లేకపోలేదు. ప్రతి రోజూ అశ్లీల చిత్రాలు చూపిస్తూ, పడక గదిలో అలాగే ఉండాలంటూ ప్రతి రోజూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ భార్య.. కట్టుకున్న భర్తను

murder
pnr| Last Updated: ఆదివారం, 8 జులై 2018 (14:31 IST)
కట్టుకున్న భర్తను ఓ కడతేర్చింది. దీనికి కారణం లేకపోలేదు. ప్రతి రోజూ అశ్లీల చిత్రాలు చూపిస్తూ, పడక గదిలో అలాగే ఉండాలంటూ ప్రతి రోజూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ భార్య.. కట్టుకున్న భర్తను కడతేర్చింది. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
మండల కేంద్రమైన చెన్నేకొత్తపల్లికి చెందిన మంగలి బసప్ప, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు మంగలి నాగేశ్‌కు బెంగళూరుకు చెందిన శ్రీరాములు, రత్నమ్మ దంపతుల కుమార్తె వరలక్ష్మితో 15 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాలాజీ, ముకేశ్‌కుమార్‌ అను ఇద్దరు కుమారులు. హతుడు నాగేశ్‌ క్షౌర వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. 
 
కొన్నేళ్ల నుంచి తాగుడుకు అలవాటుపడి కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు. భార్య వరలక్ష్మి ఎన్ని మార్లు నచ్చజెప్పినా పద్ధతి మార్చుకోలేదు. చివరికి ఇరుకుటుంబాల వారు సర్దిచెప్పినా దారికి రాలేదు. దీంతో సంపాదన లేక టైలరింగ్‌ పని చేసుకుని పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. 
 
జీవనం కోసం సెల్‌ఫోన్‌ రిపేర్ షాపును కూడా నిర్వహించింది. ఆ సమయంలో కస్టమర్లు ఫోన్‌ చేసినా అనుమానించి వేధించేవాడు. మరీ ముఖ్యంగా రోజూ రాత్రి సమయంలో సెల్‌ఫోన్‌‌లో ఉన్న అశ్లీల చిత్రాలను చూపిస్తూ కూడా వేధించసాగాడు. మూడు నెలల క్రితం కూడా ఘర్షణలు జరిగితే అందరూ మందలించడంతో మద్యం తాగడం మానేశాడు. 
 
అయితే, ప్రతి రోజూ రాత్రి అశ్లీల చిత్రాలు చూడాలని, అదేవిధంగా తన కోరిక తీర్చాలంటూ వేధించ సాగాడు, ఈ విషయం బయటకు చెప్పుకోలేని భార్య.. భర్తను చంపాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల వరకు వారిమధ్య గొడవ జరిగింది. దీంతో విసిగిపోయి తెల్లవారుజామున 4 గంటల సమయంలో భర్త గాఢనిద్రలో ఉండగా మొదట కొడవలితో నరికి తర్వాత దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది.
 
దీనిపై అత్త ఆదిలక్ష్మి ఫిర్యాదుతో పాటు నిందితురాలు వరలక్ష్మి పొంతనలేని సమాధానం ఇచ్చింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. దీంతో నిందితురాలిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై మరింత చదవండి :