బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (08:40 IST)

రేపు తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్ల చతుర్థశి పర్వదినాన అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తేదీన ఉద‌యం అనంత పద్మనాభ వ్రతాన్ని టిటిడి నిర్వహించనుంది.

కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 
 
కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు శ్రీ‌వారి ఆల‌య ప్రాగణంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పాల్గొంటారు.