బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 30 డిశెంబరు 2017 (15:21 IST)

గ్యాస్ ట్రబుల్ అనుకుంటే 7నెలల నిండు గర్భిణి.. ఎక్కడ?

ఒక్కోసారి వింత సంఘటనలు జరుగుతుంటాయి. అయితే కొన్ని తెలియకుండా జరిగిపోతుంటాయి. కానీ అలాంటి సంఘటనలే జీవితాన్ని నాశనం చేస్తుంటాయి. అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపిసి చదువుతున్న ఒక బాలిక సంవత్సరం క్రితం తల్

ఒక్కోసారి వింత సంఘటనలు జరుగుతుంటాయి. అయితే కొన్ని తెలియకుండా జరిగిపోతుంటాయి. కానీ అలాంటి సంఘటనలే జీవితాన్ని నాశనం చేస్తుంటాయి. అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపిసి చదువుతున్న ఒక బాలిక సంవత్సరం క్రితం తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 
 
ఆ తరువాత ఆ అమ్మాయి అన్న దగ్గరే ఉండి చదువుకుంటోంది. స్థానికంగా ఉన్న ఒక ఆటోడ్రైవర్ యువతిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. అయితే ఆ యువతి రెండురోజుల క్రితం నడుము నొప్పి వస్తున్నట్లు తన అన్న దృష్టికి తీసుకొచ్చింది. స్థానికంగా ఉన్న ఆర్ ఎంపి డాక్టరు వద్దకు తీసుకెళ్ళగా గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుందని మందులు రాసిచ్చాడు. నిన్న అర్థరాత్రి యువతికి కడుపు నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళారు. దీంతో ఆమె గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు.
 
ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోందని చెప్పడంతో అన్న షాక్ అయ్యాడు. అంతే కాదు పండంటి ఆడబిడ్డకు ఆ యువతి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ముందుగా భావించినా ఆ తరువాత ఆ విషయం కాస్త బయటపడింది. మంత్రి పరిటాల సునీత ఆసుపత్రికి చేరుకుని ఆ యువతని పరామర్సించి నిందితున్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.