Widgets Magazine Widgets Magazine

ఆడది కంట కనబడితే చాలు కౌగలించి ముద్దుపెట్టేయడమే.. పైగా మత్తులో ఆ పని చేశానని ఫోజు

హైదరాబాద్, మంగళవారం, 27 జూన్ 2017 (01:25 IST)

Widgets Magazine
rape

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. భారత దేశం మొత్తంమీద మద్యం ఏరులై పారుతోంది. దాని ప్రభావం తాగి తందనాలాడుతున్న వారిపై ఏ స్థాయిలో పడుతోందో ప్రతి రోజూ పత్రికల్లో, టీవీల్లో, ఆన్ లైన్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కానీ పాలకులు మాత్రం మద్యం వ్యాపారంలో వస్తున్న కాసుల పంటపై కన్నేసి తాగని వారిని కూడా తాగేలా చేసి జాతిని మద్య యజ్ఞంలో ముంచెత్తుతున్నారు. తెలుగు యువతులపై పుదుచ్చేరిలో ఆ ఆటో డ్రైవర్ చేసిన ఘాతుక చర్యను చూస్తే ఇక వందేళ్లు కూడా మహిళ ఒంటరిగానూ, గుంపుగానూ కూడా రాత్రి పూట బయట తిరికే సాహసం చేయలేదనిపిస్తోంది. 
 
హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ఆటోడ్రైవర్‌ అటకాయించి, అసభ్యంగా ప్రవర్తించిన తీరు స్థానికంగా కలకలం రేపింది. పుదుచ్చేరిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘటన పనిమీద ఉద్యోగ బాధ్యతలమీద, విహారం కోసం బయటకు వెళ్లే వారిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులు చెన్నైలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురూ విహాయాత్ర కోసమని పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ హోటల్లో రూమ్‌ అద్దెకు తీసుకుని, పలు ప్రాంతాలను తిలకించారు. 
 
ఆదివారం రాత్రి వారు అన్నాసాలై ప్రాంతంలో నిలబడి మాట్లాడుకుంటుండగా.. ఆ పక్కగా నిలబడి ఉన్న ఆటో డ్రైవర్‌ హఠాత్తుగా ఓ యువతిని అటకాయించి, కౌగిలించుకుని ముద్దుపెట్టాడు. కీచకుడి చర్యతో నిర్ఘాంతపోయిన యువతులు కేకలు వేశారు. ఈలోపు ఆ యువకుడు ఆటోలో తప్పించుకుని పారిపోయాడు. ఆటో నంబర్‌ను నోట్‌ చేసుకున్న యువతులు సరాసరి ఒదియంజాలై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 
 
ఆటో నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సోమవారం ఉదయం పుదుచ్చేరిలోని చిన్నయాపురం అక్కాస్వామి కోవిల్‌ వీధికి చెందిన స్టాలిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మద్యం మత్తులోనే తానా పని చేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు స్టాలిన్‌ను అరెస్టు చేసి, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
 
ఆ ఆటోడ్రైవర్ పట్టుబడ్డాక చెప్పిన జవాబు సమాజం మొత్తాన్ని చెళ్లున చెరుస్తోంది. ఇంతకీ శిక్షించాల్సింది తాగుబోతులనా, జాతిని మొత్తంగా తాగుబోతులను చేస్తున్న ఉండాకోరు పాలకులనా? ప్రతిరోజూ ప్రతి చోటా రాత్రి పగలూ తేడా లేకుండా ఆడది కనిపిస్తే చాలు అపహరించుకుపోయి భూమ్మీదే నరకాలను చూపిస్తున్న ఘాతుకాలకు ఎవరిని ఉరితీయాలి?
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పుట్టినరోజు నాడే ఆమె అందాన్ని చిదిమేసిన దుండగుడు... లండన్‌లో దారుణం...

లండన్‌లో పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు ఎంతో సరదాగా తన కజిన్ తో కలిసి కారులో వెళుతున్న ...

news

సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ప్రపంచం చూసింది... మాట్లాడలేదు...: నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో పలు ఒప్పందాలపై చర్చించి నిర్ణయం ...

news

అఖిలప్రియ సవాల్... ఆమె మంత్రి పదవికి గుదిబండగా మారుతుందా?

రాజకీయాలంటే వైకుంఠపాళి అని చాలామంది అంటుంటారు. రాజకీయాల్లో వున్నవారు అంత తేలిగ్గా మాటలతో ...

news

బెడ్రూంకు వెళుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్స్... షాకింగ్ నిజాలు...

ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు ఎక్కువయిపోతున్నాయి. ఆఖరికి బ్యూటీషియన్ ...