మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

కర్నూలును రెండో రాజధానిగా చేయండి : బీజేపీ నేతల డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలును రెండో రాజధానిగా చేయాలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు రాయలసీమ పేరుతో ఓ డిక్లరేషన్ పేరుతో ఓ తీర్మానం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలును రెండో రాజధానిగా చేయాలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు రాయలసీమ పేరుతో ఓ డిక్లరేషన్ పేరుతో ఓ తీర్మానం చేశారు. 
 
రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు, గవర్నర్ తాత్కాలిక విడిది, సీఎం నివాసం ఏర్పాటు చేయాలని, రాయలసీమలో అసెంబ్లీ భవనం ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమలో 6 నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. 
 
దీనికి తెలుగుదేశం పార్టీకి చెందిన రాయలసీమ నేతలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా, టీడీపీ సీనియర్ నేత, ఎంపీ టీజీ వెంకటేష్ బీజేపీ నేతల తీర్మానాని సమర్థించారు. 15 ఏళ్లుగా కర్నూలును రెండో రాజధాని చేయాలని వాదిస్తున్నానని అన్నారు. సీమలో రెండో రాజధానికోసం మద్దతు తెలిపేవారందరినీ టీజీ స్వాగతించారు. 
 
కాగా, రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసి దాన్ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైవున్నారు. ఈ రాజధాని నిర్మాణానికే నిధులు లేకపోవడంతో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కర్నూలును రెండో రాజధానిగా చేయాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకుని రావడం గమనార్హం.