శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:53 IST)

జగన్‌ అనవసరంగా కలలు కంటున్నారు: డిప్యూటీ సీఎం

రెవిన్యూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి. తిరుపతిలో జరిగిన ఎపివిఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తవత్సలనాయుడు పదవీ విరమణ మహోత

రెవిన్యూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి. తిరుపతిలో జరిగిన ఎపివిఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తవత్సలనాయుడు పదవీ విరమణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతుండడం మంచిది కాదన్నారు. 
 
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏమిటో ప్రజలకు తెలుసునని, జగన్ విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాజీ సిఎం కొడుకు సిఎం అవ్వాలని ఎక్కడా లేదని, జగన్ అనవసరంగా కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.