మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (21:53 IST)

ఏపీలో కరోనా.. 56మందికి కోవిడ్ పాజిటివ్.. ఏడు నెలల్లో..?

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 27,717 శాంపిల్స్‌ పరీక్షించగా 56 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా 141 మంది కోలుకోగా.. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. 
 
తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 1,29,03,830 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,87,066 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,78,528 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 7149మంది మృతిచెందారు. ప్రస్తుతం 1389 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
మొత్తం రికవరీలు 8,78,528కు, మరణాలు 7,149కు పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పుడు 1,389 క్రియాశీల కేసులు ఉన్నాయి. 24 గంటల్లో, కృష్ణ జిల్లాలో మాత్రమే 11 కొత్త కేసులు నమోదు కాగా, ఐదు జిల్లాల్లో ఐదు నుంచి పది మధ్యలో వున్నాయి. మూడు జిల్లాలు సున్నా కేసులను నమోదు చేశాయి. తద్వారా గత ఏడు నెలల్లో అతి తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.