సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (08:59 IST)

పిడుగుపడటంతో జేబులోనే పేలిపోయిన ఫోన్... యువకుడి దుర్మణం

deadbody
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని గొలుగొండ మండలం జోగుంపేటలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. ఆ సమయంలో ఆరు బయట ఉన్న ఒక యువకుడిపై పిడుగుపడింది. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆయన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు గాయాలతో తప్పించుకున్నారు. 
 
గొలుగొండ మండలానికి చెందిన సూదవరపు జయంత్ (23) అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా, జోగుంపేటకు వచ్చే సమయానికి వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. దీంతో అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేరిపోియంది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.