Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోదుకూరులో దారుణం.. ఏడేళ్ల బాలికను రేప్ చేసిన 23యేళ్ల కామాంధుడు

మంగళవారం, 8 మే 2018 (08:43 IST)

Widgets Magazine

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన గురించి ఇంకా ఏ ఒక్కరూ మరచిపోలేదు. ఈ లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ ఘటన మరిచిపోకముందే గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అదీ దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన మరునాడే, అంటే ఈనెల 3వ తేదీన ఏడేళ్ల బాలికపై దూరపు బంధువే అకృత్యానికి పాల్పడ్డాడు. మద్యం మత్తు తలకెక్కిన స్థితిలో, ఆ చిన్నారిని లైంగికంగా చిత్రవధ లైంగికదాడి చేశాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మోదుకూరులో కూలిపని చేసుకుని భార్యాభర్తలు జీవిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. పెద్ద అమ్మాయికి ఏడేళ్లు. ఆ ఇంటి పక్కనే దూరపు బంధువు నాగుల్‌మీరా (23) ఇల్లు ఉంది. గత గురువారం ఉదయాన్నే పిల్లలను ఇంటి దగ్గరే వదిలి తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లిపోయాడు. ఏదో పనిమీద తల్లి తెనాలి వెళ్లింది. ఇంటి దగ్గర ముగ్గురు పిల్లలూ ఆడుకొంటున్నారు. 
 
ఆ రోజు పనికి పోకుండా మద్యం మత్తులో ఉన్న నాగుల్‌మీరా అటుగా వచ్చాడు. ఆడుకొంటున్న పిల్లల్లో ఏడేళ్ల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆరోజు రాత్రి చిన్నారికి బాగా జ్వరం వచ్చింది. రెండురోజులు గడిచినా కోలుకోలేదు. ఆదివారం బట్టలు ఉతుకుతున్న తల్లి.. పాప గౌనుపై రక్తపు మరకలు చూసి భయపడింది. పాపను దగ్గర కూర్చోబెట్టుకొని ఆరాతీయగా జరిగిందంతా చెప్పేసింది. తల్లిదండ్రులు మరునాడు పాపను తీసుకొని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పాప ను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ ...

news

ఆడబిడ్డల జోలికొస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తాం : చంద్రబాబు హెచ్చరిక

ఆడబిడ్డల జోలికి వస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ...

news

సమాఖ్య పరిరక్షణకే ఆర్థిక మంత్రుల సమావేశం... కేంద్రంపై టార్గెట్...

అమరావతి: సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసమే ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ...

news

టిడిపి - బిజెపి గొడవలోకి వేంకటేశ్వరుడిని లాగుతున్నారు.. ఎందుకు...?

గత ఎన్నికల్లో కలిసి పోటీచేసి, నాలుగేళ్లు కలిసి ప్రభుత్వాలు నడిపి, ఇటీవలే తెగదెంపులు ...

Widgets Magazine