Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీడీపీ కేంద్ర మంత్రులకు సిగ్గేలేదు... వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (10:32 IST)

Widgets Magazine
raghuram

'తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు ఏమాత్రం సిగ్గూశరం లేదు. వారికి వెన్నుపోటు పొడవడం అనేది వెన్నతో పెట్టిన విద్య. తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా బీజేపీకి వెన్నుపోటు పొడుస్తుందన్న విషయం మాకు బాగా తెలుసు'. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర సమన్వయకర్త. పేరు రఘురాం. 
 
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందంటూ బీజేపీపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూ, పార్లమెంట్ వేదికగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటలయుద్ధం తారా స్థాయికి చేరింది. 
 
ఈ నేపథ్యంలో రుఘురాం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, టీడీపీకి వెన్నుపోటు ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు అనుభవిస్తున్న కేంద్ర మంత్రి పదవులకు వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. వారికసలు సిగ్గేలేదని వ్యాఖ్యానించారు. 
 
ఏపీని బీజేపీ ఎంతగానో ఆదుకుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు కనిపించిన బీజేపీ నిధులు, ఇప్పుడు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు ఎంపీలైతే, వారి వ్యక్తిగత ప్రయోజనాలే చూసుకుంటారే గానీ, ప్రజల ప్రయోజనాలను పట్టించుకోరన్నారు. అలాగే, వాజ్‌పేయి దయతో ఒకసారి, మోడీ దయతో మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ విషయాన్ని ఇప్పుడాయన మరచి పోయారని రఘురాం విమర్శించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అవినీతి ఆరోపణలు .. దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి రాజీనామా

అవినీతి ఆరోపణల నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి జాకబ్ జుమా రాజీనామా చేశారు. ఈయన ...

news

పవన్ డెడ్‌లైన్‌ను పట్టించుకోని టీడీపీ - ఇక వార్ వన్‌సైడేనా?

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను బహిర్గతం చేయాలంటూ జనసేన ...

news

కాపు బిల్లుకు కేంద్రం బ్రేక్ : చంద్రబాబుకు మోడీ మరోషాక్

తెలగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్రంలోని ప్రధానమంత్రి ...

news

అమెరికాలో గన్‌కల్చర్... సస్పెండ్ చేశారనీ సహచరులను కాల్చి చంపిన విద్యార్థి

అమెరికాలో గన్‌కల్చర్ మరోమారు పడగవిప్పింది. ఉన్మాదిగా మారిన ఓ విద్యార్థి సహచర విద్యార్థిని ...

Widgets Magazine