శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 25 మే 2018 (18:31 IST)

అటు రమణదీక్షితులు... ఇటు శ్రీవారి నగలు... టిటిడి ఛైర్మన్ పుట్టాకు సిఎం క్లాస్..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి ఒకే ఒక బోర్డు మీటింగ్‌తో టిటిడిని రోడ్డుపైకి లాగారు ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. మొదటి సమావేశంలోనే అర్చకుల వయోపరిమితిపై చర్చించి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను పదవీ విరమణ చేయించా

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి ఒకే ఒక బోర్డు మీటింగ్‌తో టిటిడిని రోడ్డుపైకి లాగారు ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. మొదటి సమావేశంలోనే అర్చకుల వయోపరిమితిపై చర్చించి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను పదవీ విరమణ చేయించారు. ఇది కాస్తా తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే టిటిడిలో తీవ్రస్థాయిలో ఇదే వ్యవహారంపై చర్చ కూడా జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం అమరావతిలో టిటిడి వ్యవహారంపై ఈఓ, ఛైర్మన్‌లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. టిటిడి ప్రతిష్ట దిగజారేలా ఎక్కడా వ్యవహరించవద్దంటూ ఆదేశాలిచ్చారు.
 
ఆ తరువాత నిన్న రాత్రి పుట్టా సుధాకర్ యాదవ్‌కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి క్లాస్ పీకారట. పుట్టా సుధాకర్ యాదవ్ ఎందుకిలా చేశావ్. మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు శ్రీవారి పవిత్రత దెబ్బ తింటోందని, మరోవైపు టిటిడి ప్రతిష్ట దిగజారుతోందని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. జాతీయస్థాయిలో ఈ వ్యవహారం కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
మరోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించు అంటూ పుట్టా సుధాకర్ యాదవ్‌కు క్లాస్ పీకారట చంద్రబాబునాయుడు. చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడితే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ఏం మాట్లాడగలరు. సరే.. సార్ అంటూ ఫోన్ పెట్టేశారట. రానున్న పాలకమండలి సమావేశంలోనైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట పుట్టా సుధాకర్ యాదవ్. అంతేలే... కొత్తగా సీటెక్కాక అలాగే అనిపిస్తుంది మరి.