శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 8 ఆగస్టు 2018 (08:16 IST)

చీరాల వేటపాలెంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, చేనేత కార్మికులకు...

రాష్ట్రంలో చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండల చల్లారెడ్డి పాలెం గ్రామంలోని సెంట్ ఆన్స్ కాలేజీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి

రాష్ట్రంలో చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండల చల్లారెడ్డి పాలెం గ్రామంలోని సెంట్ ఆన్స్ కాలేజీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన అన్నారు. వర్షాకాలంలో చేనేత కార్మికుల ఇండ్లల్లోకి నీరువచ్చి పనులకు ఇబ్బంది కలిగినప్పుడు చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి నెలకు 4 వేల రూపాయల వంతున రెండు నెలలకు 8 వేల రూపాయలు నష్టపరిహారం అందిoచడాని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. దీనివల్ల  ప్రభుత్వానికి అదనంగా 37 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. 
 
రాష్ట్రంలో90,765 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల వంతున చెల్లించి ఆరోగ్య బీమా పధకాన్ని పునరుద్ధరణ చేస్తామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. చేనేత కార్మికులు నేత పనిని పవిత్ర వృత్తిగా చేస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లాలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు జరిగాయని అయన అన్నారు. ఈ విషయాలను స్వయంగా పరిశీలించి బాధపడ్డానని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే  జిల్లాలో 111 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామన్నారు. 
 
ఒక్క చీరాల ప్రాoతములో 11.53 కోట్ల రూపాయల రుణమాఫీ అమలు చేశామన్నారు. 18 వేల మంది చేనేత కార్మికులకు 6.32 కోట్ల రూపాయల వ్యక్తిగత రుణాలను మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 55 వేల మంది చేనేత కార్మికులకు పావలా వడ్డి పథకం క్రింద 16.85 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. చేనేత కార్మికులు మగ్గాల మీద ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల త్వరగా అనారోగ్యాలకు గురవుతుంటారన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి 50 సంవత్సరాలకు పెన్షన్లు అందించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. 
 
రాష్ట్రంలో 96 వేల 900 మందికి చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారు. రాష్ట్రంలో 13 జిల్లాలో చేనేత బజార్లు ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆదరణ  పథకం క్రింద చేనేత కార్మికులకు పనిముట్లు అందిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మాగ్గాలు ఉన్న చేనేత కార్మికులకు 100 యూనిట్లు లోపు వినియోగదారులకు ఉచితం విద్యుత్ అందిస్తామన్నారు.
 
చీరాల కుందేరు డ్రైన్ ఆధునీకరణ పనులు రాబోయే రెండు సంవత్సరాలల్లో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర చేనేత జౌళ్లి, బి.సి.సంక్షేమ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పొంగురు నారాయణ, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, హిందూపురం పార్లమెంట్ సభ్యులు నిమ్మల క్రిష్ణప్ప, శాసన మండలి సభ్యులు కరణo బలరాం కృష్ణమూర్తి, పోతుల సునీత, చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే డీ. బి.వీ.స్వామి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, వై.పాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎస్.ఎన్. పాడు మాజీ ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి, శ్రీమతి పంచుమర్తి అనూరాధ, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కరణo వెంకటేష్, దామాచర్ల సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ శ్రీ వీ. వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ శ్రీ ఎస్. నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, డీ. అర్. డీ. ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ ఎం.ఎస్.మురళి తదితరులు పాల్గొన్నారు.