గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శనివారం, 8 జూన్ 2019 (16:20 IST)

జగన్ ప్రజా నాయకుడు... రియల్ హీరో... 'బాహుబలి' పెదనాన్న పొగడ్తలు

ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది మొదలు సీఎం జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న ఒక్కో అడుగు సంచలనాత్మకంగానే వుంటుంది. అదేసమయంలో అందరూ హర్షించే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. తాజాగా ఆయన సామాజిక సమీకరణాలను బెరీజు వేసుకుంటూ మంత్రి పదవులను ఆయా వర్గాలకు కట్టబెట్టడంపై బాహుబలి పెదనాన్న, సీనియర్ నాయకుడు, నటుడు కృష్ణంరాజు పొగడ్తలు జల్లు కురిపించారు. 
 
మంత్రివర్గ విస్తరణలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సామాజిక విప్లవానికి నాంది అని, రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్ మంత్రి మండలిని ఏర్పాటు చేశారంటూ పొగడ్తల జల్లు కురిపించారు. ముఖ్యంగా ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను వరుసగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం జగన్ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనమన్నారు. ఇంత చిన్న వయసులోనే పరిణతి కలిగిన నేతగా ఎదిగిన జగన్ మోహన్ రెడ్డి నిజమైన ప్రజా నాయకుడని కొనియాడారు.