గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (11:24 IST)

మూడో అల ముప్పు... ముందస్తు ఏర్పాట్లకు సీఎం జగన్ ఆదేశం

దేశంలో కరోనా వైరస్ మూడో అల వ్యాప్తి తప్పదని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ముందుగానే అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా, ఏపీ సర్కారు మరింతగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, రాష్ట్రంలోని కొవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్‌ బుధవారం సమీక్షించారు.
 
ఇతర రాష్ట్రాల్లోని కొవిడ్‌ పరిస్థితులపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనాలో మూడో వేవ్‌ సంకేతాల దృష్ట్యా పీహెచ్‌సీలలోనూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. 
 
ఇతర రాష్ట్రాల్లోని కొవిడ్‌ పరిస్థితులపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించారు. అధ్యయనం చేయబోయే రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు స్ఫూర్తిమంతంగా ఉంటే రాష్ట్రంలోనూ అనుసరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. 
 
ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, ‘కరోనాలో మూడో వేవ్‌ సంకేతాల దృష్ట్యా పీహెచ్‌సీలలోనూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైప్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం జిల్లాల వారీగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. ఆసుపత్రుల నిర్వహణలో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్‌, ఏసీ మరమ్మతులు, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నిపుణులను నియమించాలని సీఎం ఆదేశించారు.