శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (16:14 IST)

వరదలు వచ్చినా ప్రాజెక్టులు నిండలేదా...? 40 రోజుల్లో అన్నీ నిండాలి

వరదజలాలు వచ్చే 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలో ఇంత వరద వచ్చినా ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నింపకపోవడంపై జగన్ ఆరా తీశారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో ఉన్న రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులు సీఎంకు వివరించారు.
 
ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనులనుపై సీఎంకు అధికారులు నివేదిక అందించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా, కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా అధికారులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం నడుస్తున్న, తప్పకుండా కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి ఆమేరకు అంచనాలను ఈ నివేదిక ద్వారా ఇవ్వాలని సూచించారు.
 
నిధుల వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతల పరంగా నిధులను ఖర్చు చేయాలని అన్నారు. చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు.