Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్ కసి మొత్తం దానిమీదే... అందుకే పాదయాత్ర... ఉపముఖ్యమంత్రి కేఈ

మంగళవారం, 7 నవంబరు 2017 (15:58 IST)

Widgets Magazine
KE Krishnamurthy

ప్రతిపక్షనాయకుడి అవినీతి చరిత్ర దేశం ఎల్లలు దాటి భూగోళం అంతా వ్యాపించిందనీ, ఈ విషయం ప్యారడైజ్ పేపర్స్ ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. అవితీ ముద్ర వేసుకుని దాన్ని మోస్తున్న జగన్ మోహన్ రెడ్డి అవినీతిని అరికడతాననడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. ఆయన తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. 
 
జగన్ పాదయాత్ర చూసి అన్న వస్తున్నాడు కాదు, మనల్ని దోచుకోవడానికి దొంగ వస్తున్నాడంటూ జనం పారిపోతున్నారని విమర్శించారు. బాబు పోతే జగన్ మోహన్ రెడ్డికి జాబ్ వస్తుంది, ఆ తరువాత జనం నెత్తిన టోపి వస్తుందని ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ఆయన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
 
ప్రతిపక్షనాయకుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తి, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి సీఎంని చేయండంటూ  పాదయాత్ర మొదలుపెట్టాడు. జగన్ కసి మొత్తం సి.ఎం కుర్చీకోసమేనని, ఆయనకు సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ప్రతిపక్షనాయకుడికి చట్టసభలన్నా, న్యాయ వ్యవస్థలన్నా గౌరవం లేదన్నారు. 
 
ముఖ్యమంత్రి మీద నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా పోలవరంతో పాటు ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీక్రెట్‌గా శృంగార వీడియోలు.. బాగానే వెతికేస్తున్నారు.. షాక్ థెరపీ పేరుతో?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయి. దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీ పెద్ద ...

news

రాజకీయాలకంటే ప్రజలే ముఖ్యం.. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తాలి: కమల్

సినీనటుడు కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు. క్షేత్రస్థాయిలో ...

news

కన్నకొడుకు మూర్ఛరోగి.. శ్మశానానికి మోసుకెళ్లి.. గొంతునులిమి.. కిరోసిన్ పోసి?

కన్నకొడుకు మూర్చరోగి కావడం.. 23ఏళ్లు వచ్చినా ఆ వ్యాధి అతని వెన్నంటి రావడంతో ఆ తండ్రి ...

news

ప్రేమిస్తుంది... శృంగారం చేస్తుంది... ఆ తర్వాత లేపేస్తుంది.. ఎందుకో తెలుసా?

ఆమె చాలా డేంజరస్ లేడీ. డబ్బు కోసం పక్కా స్కెచ్ వేసి మగాళ్లను వలవేసి లాగేసి వరసబెట్టి ...

Widgets Magazine