1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జులై 2025 (17:44 IST)

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని కించపరుస్తు వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని కించపరిచేలా, మహిళల వ్యక్తిత్వ హననకు పాల్పడటం వైకాపా నేతలకు పరిపాటిగా మారిందన్నారు. 
 
నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైకాపా నేతలకు పరిపాటిగా మారిపోయింది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. వ్యక్తిగత జీవితాను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలి. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలుంటాయి. శాసనసభలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మహిళా సమాజం మరోమారు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.