శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కరోనా రోగం : ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ధరలు ఇవే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ బారినపడిన రోగులకు చికిత్స చేసే రేట్లను నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అలాగే, ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చి, అందుకు ధరలు నిర్ణయించారు. 
 
తాజాగా కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జారీ చేశారు.
 
ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇవే!
* క్రిటికల్‌గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3,250
* ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకు రూ.5,980
* క్రిటికల్ పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే రోజుకు రూ.5,480
* వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తే రూ.9,580
* ఇన్ఫెక్షన్ ఉన్నవారికి వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రూ.6,280
* ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకు రూ.10,380