శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (17:39 IST)

సీఎం జగన్ ఆ విషయంలో అదరగొట్టారు..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శలొస్తున్న వేళ.. రికార్డు స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన విషయంలో సఫలమయ్యారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలను భర్తీ చేయాలనుకున్నా ఆ ఆశయం నెరవేరలేదు. 
 
కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. దీంతో తాము గెలిస్తే ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. 
 
ఇందులో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఎనిమిది వరకు గ్రామ వార్డు సచివాలయం పరీక్షలను జగన్ సర్కారు నిర్వహించింది. అయితే మునుపెన్నడూ లేని విధంగా కేవలం 10 రోజుల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేసి ఒకేసారి 1,26,728 ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 
 
అయితే అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులు... దానిని ఒక యజ్ఞంగా పూర్తి చేశారని అధికారులను అభినందించారు జగన్. కాగా ఏకకాలంలో 1,26,728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్ష ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేయడం చరిత్రలో నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు. 
 
అయితే గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. సచివాలయం పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు వెల్లడించారు. విజయం సాధించిన అభ్యర్థులకు మంచి శిక్షణ అందిస్తామని, అనంతరం అభ్యర్థులు ప్రజాసేవలో మమేకం కావాలని సూచించారు.