గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (13:50 IST)

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

aphighcourt
సోషల్ మీడియా వేదికను చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారు. దీనిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వారిపై కేసులు పెడితే తప్పేంటి అని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో కూడా జడ్జిలను దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. 
 
పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. 
 
సామాజిక మధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పోలీసులు అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై మరింతగా రెచ్చిపోనున్నారు.