శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2017 (16:14 IST)

తితిదే ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఎందుకు..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లోని హోటళ్లలో భోజనం చేసే భక్తుల నుంచి అధిక రేట్లు తీసుకుంటున్నారన్న దానిపై దాఖలైన పిటిషన్‌ పైన హైకోర్టు న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్ వాదోపవాదాలను విన్నారు.

భక్తుల నుంచి అధిక ధరలు వసూళ్ళు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఈఓ శ్రీనివాసరాజుల ప్రశ్నించారు న్యాయమూర్తి. న్యాయమూర్తి ప్రశ్నకు తితిదే ఉన్నతాధికారులు విన్నవిస్తూ... నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న హోటళ్ల పైన ఒక నెల అద్దెను ఫైన్‌గా వసూలు చేస్తామన్నారు.