మీకు దణ్ణం పెడతా.. నా కుటుంబాన్ని రోడ్డుపైకి లాగొద్దండి.. ప్లీజ్?

Akhila Priya
జె| Last Modified శనివారం, 12 జనవరి 2019 (14:18 IST)
కొన్ని న్యూస్ ఛానళ్ళపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భూమా అఖిలప్రియ. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేను పార్టీని వీడటం ఏమిటి. ఆళ్ళగడ్డలో నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కావాల్సినంత నిధులు ఇచ్చింది. మంత్రిగా పర్యాటక శాఖను అభివృద్థి చేస్తున్నాను. నాకు టిడిపిలో ఒక గౌరవం ఉంది. చంద్రబాబు నాపై ఒక నమ్మకం ఉంచారు.

ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు పార్టీని వీడుతాను. నాకు అంత అవసరం లేదు. నేను నా చెల్లెలు జనసేన పార్టీలోకి వెళుతున్నానని చెబుతున్నారు. జనసేన పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం నా కుటుంబానికి లేదు. నేను పార్టీపై అలగలేదు. నాపై పార్టీ కోపంగా లేదు.

ఇదంతా రెండు మూడు ఛానళ్ళు నాపై బురద జల్లుతున్నాయి. న్యాయపరంగా వారిని ఎదుర్కొంటాను. మీకు దణ్ణం పెడతాను. నన్ను రోడ్డుపైకి లాగొద్దండి అంటూ మంత్రి భూమా అఖిలప్రియ నడిరోడ్డుపై అన్నారు.దీనిపై మరింత చదవండి :