Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజూ ఓ గంట క్రీడలకు కేటాయించండి... మంత్రి కొల్లు

సోమవారం, 4 డిశెంబరు 2017 (21:53 IST)

Widgets Magazine
Kollu

అమరావతి : ప్రతిరోజూ ఓ గంట క్రీడలకు కేటాయిస్తే, అందరూ ఆరోగ్యంగా ఉంటారని యువజన, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సచివాలయ ఉద్యోగులకు సలహా ఇచ్చారు. సచివాలయం 3వ బ్లాక్ ఎదుట సోమవారం సాయంత్రం సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2017ను బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన రాజధానిలో ఆటలకు సంబంధించి సకల సౌకర్యాలతో స్పోర్ట్స్ నగరమే నిర్మిస్తున్నట్లు తెలిపారు. 
 
ఉద్యోగులు కోరిన విధంగా సచివాలయంలోని జిమ్‌లో ఒక ట్రైనర్‌ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్పోర్ట్స్ నిర్వహణకు నిధులను కూడా రూ.10 లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించినవారికి ఇంక్రిమెంట్స్ ఇచ్చే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళతానన్నారు. ఆ తరువాత మంత్రి జిమ్ లోపల టేబుల్ టెన్నీస్ ఆడి ఉద్యోగులను ఉత్సాహపరిచారు.
 
అంతకుముందు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎండల వల్ల ఈ క్రీడా పోటీలను వాయిదా వేసినట్లు చెప్పారు. రెగ్యులర్ ట్రైనర్‌ని నియమించాలని, క్రీడల నిర్వహణకు నిధులు పెంచాలని, మెడల్స్ సాధించిన వారికి ప్రోత్సాహకంగా గతంలో ఇచ్చిన మాదిరిగా ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. క్రీడల విభాగం జాయింట్ సెక్రటరీ ఎన్ఎస్ పవన్ కుమార్ మాట్లాడుతూ నవ్యాంధ్ర నూతన సచివాలయంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఆటల పోటీలు ఇవని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 
 
ఈ పోటీల్లో పురుషులకు 19 విభాగాల్లో, మహిళలకు 16 విభాగాల్లో, ఇంకా వెటరన్ పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. సచివాలయంలోని 6 బ్లాకుల్లోని ఉద్యోగులను 4 గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ స్పిమ్మింగ్-2016లో కాంస్య పతకం సాధించిన కె. వెంకట్రావు, సౌత్ ఏషియన్ వెటరన్ టేబుల్ టెన్నీస్ లో రజత పతకం సాధించిన బి.సుజాతలను మంత్రి సన్మానించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రామకృష్ణ, మహిళా ఉద్యోగుల సంఘం నాయకురాలు సత్యసులోచన తదితరులు పాల్గొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నపుంశక భర్తకు సరైన శిక్షే పడిందా?

భార్య శైలజను చిత్రహింసలకు గురిచేసి నరకయాతన చూపించిన చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరుకు ...

news

'అమ్మ' స్థానానికి హీరో విశాల్ నామినేషన్... ఆశ్చర్యపోతున్న ఆర్కే పీపుల్

తమిళ నటుడు విశాల్ అనూహ్యంగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకున్నారు. ఆర్.కే.నగర్ ఉప ...

news

రేప్ చేస్తే ఉరే : బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇకపై కామాంధుల పట్ల అత్యంత ...

news

ఉత్తర కొరియాలో 'ఘోస్ట్‌ డిసీజ్‌'.. పారిపోతున్న సైనికులు

ఉత్తరకొరియాలో అంతుచిక్కని వ్యాధి ఒకటి విజృంభిస్తోంది. దీంతో ఆ దేశ సైనికులతో పాటు ప్రజలు ...

Widgets Magazine