సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 30 ఆగస్టు 2018 (21:06 IST)

కేరళ వరద బాధితులకు మంత్రులు అమర్నాథ్, సుజయ నెల జీతం విరాళం

అమరావతి: భారీ వర్షాలు, వరదలతో అన్ని రకాలుగా చితికిపోయిన కేరళకు పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి గారు, భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రులు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. తమ నెల జీతం కేరళ ముఖ

అమరావతి:  భారీ వర్షాలు, వరదలతో అన్ని రకాలుగా చితికిపోయిన కేరళకు పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి గారు, భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రులు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. తమ నెల జీతం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుతున్నట్లు మంత్రులు వెల్లడించారు. 
 
ప్రకృతి అందాలకు నెలవైన కేరళ అదే ప్రకృతి ప్రకోపానికి గురికావడం బాధాకరమన్నారు. కేరళ వరదల ధాటికి భారీగా నష్టపోయింది. వేలాదిమంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు సహాయం చేయాలి. కేరళ ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రులు పిలుపునిచ్చారు. ప్రకృతి విళయం నుంచి త్వరగా కోలుకొని అభివృద్ధి బాట పట్టాలని కోరుకున్నారు.