Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు - వై.ఎస్.జగన్ మధ్య రహస్య ఒప్పందమా?

మంగళవారం, 2 జనవరి 2018 (11:27 IST)

Widgets Magazine
Jagan-babu

ఏపీ రాజకీయాల్లో మరో అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడుల మధ్య గత కొన్నిరోజులుగా మాటల యుద్ధం తగ్గిపోయింది. ఒకవేళ ఆరోపణలు చేసుకున్నా అర్థవంతమైన ఆరోపణలు తప్ప, అనవసరమైన విమర్శలు అస్సలు చేసుకోవడం లేదు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుక సమయంలో చంద్రబాబు నాయుడు పెట్టిన ట్వీట్‌తో జగన్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
 
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఇరు పార్టీల నాయకులు మాత్రం యధావిధిగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే విమర్శలు మాత్రం పెద్దగా ఘాటైన రీతిలో సాగటంలేదు. గతంలో అయితే ఇద్దరు నేతలు పరస్పరం చేసుకునే విమర్శలు తారాస్థాయిలో ఉండేవి. 
 
ప్రజల్లో చులకన అయిపోతున్నామన్న భావనతోనే ఇద్దరు నాయకులు విమర్శల్లో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఎన్నికల ముందు జరిగే ఎన్నికల ప్రచారం వరకు మాత్రమేనని, ప్రచారంలో మాత్రం ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విమర్శలు మానడంపై రాజకీయ విశ్లేషకులు ఇది నిజంగానే బాబు, జగన్‌ల మధ్య ఏదయినా రహస్య ఒప్పందమేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు శాపంగా మారారు: ముషారఫ్ ఆరోపణ

పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ ...

news

జనసేనకు చిరు సపోర్ట్ అవసరం... నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తన 50 యేళ్ళ జీవితంలో 20 యేళ్ళ పాటు స్తబ్దుగా సాగిపోయిందని మెగా బ్రదర్ నాగబాబు ఆవేదనతో ...

news

నా టేబుల్‌పైనే అణ్వస్త్ర బటన్ ఉంది : కిమ్ జాంగ్ ఉన్

కొత్త సంవత్సరం... కొంగ్రొత్త ఆశలు, ఆశయాలు, ఆవిష్కరణలతో ముందుకెళ్లాలని ప్రపంచం ...

news

రజినీ రాజకీయ రంగప్రవేశంపై రోజా అలా చెప్పేశారు....

తమిళ తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన తరువాత ఒక్కొక్కర ఒక్కో ...

Widgets Magazine