Widgets Magazine

మహిళను టీడీపీ నేతలు వివస్త్ర చేస్తే.. బాబు నోరెత్తలేదు: రోజా

శనివారం, 30 డిశెంబరు 2017 (17:07 IST)

rk roja

విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసిన కొట్టారని.. అయినా ఏపీలోని చంద్రబాబు సర్కారు ఏమాత్రం నోరెత్తలేదని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. 2017 నారావారి నరకాసుర సంవత్సరమని రోజా ధ్వజమెత్తారు.

చంద్రబాబు సర్కారు, అరాచకాలు, ఆత్మహత్యలు, అత్యాచారం వంటి అబద్ధాలతో ఏపీ సాగుతోందని ఆరోపించారు. 
 
చంద్రబాబు పాలనలో క్యాలెండర్లు మారేయే కానీ.. తలరాతలు మాత్రం మారలేదని చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు వద్దంటూ ఆదేశించిన ప్రభుత్వం... 31వ తేదీన అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలను ఎందుకు అనుమతించిందని రోజా మండిపడ్డారు. 
 
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాల్లో చంద్రబాబు ఒక్క శాతం కూడా చేయలేదని రోజా విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేశారని... సబితకు హోంమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఐదుగురు మహిళలను మంత్రులు చేశారని రోజా చెప్పారు. ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలతో మహిళలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాకిస్థాన్‌కు చెప్పు దెబ్బ: ఆన్‌లైన్‌లో జత చెప్పులు ఆర్డర్ చేసిన బీజేపీ నేత..

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ అమానుషంగా ...

news

గ్యాస్ ట్రబుల్ అనుకుంటే 7నెలల నిండు గర్భిణి.. ఎక్కడ?

ఒక్కోసారి వింత సంఘటనలు జరుగుతుంటాయి. అయితే కొన్ని తెలియకుండా జరిగిపోతుంటాయి. కానీ అలాంటి ...

news

మీకేం పనిలేదా? రజినీకాంత్ గురించి నన్నడుగుతారే? రాధిక ఫైర్

ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా తలైవా రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపైనే తీవ్రస్థాయిలో చర్చ ...

news

అమ్మ గదిలో సోదాలు.. జయలలిత వీడియో నమ్మశక్యంగా లేదు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌లో ఐటీ ...

Widgets Magazine