మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:15 IST)

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో ఈ నెల 13, 14 తేదీల్లో అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు జరుగుతాయని సెట్విన్‌ సీఈవో మురళీకృష్ణ  తెలిపారు. 

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 14, 16, 18 ఏళ్లలోపు విభాగాలకు క్రీడాకారులను ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాలకు 98490 14639 నెంబరును సంప్రదించాలని కోరారు.