మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (07:23 IST)

కృష్ణా జిల్లా ఆటో డ్రైవర్లకు అవగాహన

కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి సారధ్యంలో నందిగామ రూరల్ సిఐ సతీష్ వీరులపాడు మండలంలోని వి.అన్నవరం, దొడ్డ దేవరపాడు, జయంతి, పెద్దాపురం, గూడెం మాధవరం, కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్టులలో తనిఖీలు నిర్వహించారు. 

చెక్ పోస్టు వద్ద ఉన్న సిబ్బందినీ అప్రమత్తం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ రవాణా చేసే వారి ఆట కట్టించాలని పలు సూచనలు సిబ్బందికి అందజేశారు. అలాగే కంచికచర్ల నుంచి మధిర వెళ్లే రహదారిలో పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేస్తున్న ఆటోలను ఆపి, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ.. అక్రమ రవాణాకు తావులేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని, వారికి తగు సూచనలు సలహాలు అందజేయడం జరిగిందని, అలాగే ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల నివారణ భాగంగా ఆటో డ్రైవర్లకు,కూలీలకు  అవగాహన కల్పించడం జరిగిందని, పరిమితికి మించి ఆటోలలో ప్రయాణం ప్రమాదకరమని ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించ రాదని హెచ్చరించారు.