పరీక్షలో ఫెయిలైన విద్యార్థిని.. తల్లిదండ్రులు తిట్టలేదనీ సూసైడ్

సాధారణంగా పరీక్షల్లో ఫెయిలైతే తల్లిదండ్రులు మందలించారని, ఫ్రెండ్స్ హేళన చేశారనీ చిన్నబుచ్చుకుని చనిపోయిన వాళ్లను చూశాం. అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్నవారినీ చూసాం. అయితే ఓ విద్యార్థిని మాత్రం తాను ప

suicide
pnr| Last Updated: సోమవారం, 14 మే 2018 (10:30 IST)
సాధారణంగా పరీక్షల్లో ఫెయిలైతే తల్లిదండ్రులు మందలించారని, ఫ్రెండ్స్ హేళన చేశారనీ చిన్నబుచ్చుకుని చనిపోయిన వాళ్లను చూశాం. అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్నవారినీ చూసాం. అయితే ఓ విద్యార్థిని మాత్రం తాను పరీక్షలో ఫెయిలైనా అమ్మానాన్న తిట్టలేదని చేసుకుంది.
 
ఈ విషాదకర ఘటన ప్రశాశం జిల్లా జరిగింది. ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తురకపాలెం గ్రామానికి చెందిన గురులక్ష్మి (20) విద్యార్థిని.. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్‌ చదువుతోంది. ఈ క్రమంలో గురులక్ష్మి మొదటి సంవత్సరంలో 9 సబ్జెక్టుల్లో ఫెయిలైంది. అయినా తల్లిదండ్రులు పల్లెత్తు మాటనలేదు. 
 
దీనికి విద్యార్థిని మరింత మనస్తాపం చెందింది. చిన్న సూసైడ్‌ నోట్‌ రాసి.. ఈనెల 11వ తేదీ శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన బంధువులు ఆమెను ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ హస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది.
 
పరీక్షలో ఫెయిలైన తమ అమ్మాయిని తిడితే ఏమన్నా చేసుకుంటుందో ఏమోనని.. ఎప్పుడూ తిట్టేవారిమి కాదని.. అయినా తన కూతురు సూసైడ్ చేసుకుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై మరింత చదవండి :