Widgets Magazine

నా మొగుడు వేస్ట్‌గాడు.. వాడ్ని చంపేస్తే మన ఎంజాయ్ చేయొచ్చు...

సోమవారం, 14 మే 2018 (09:05 IST)

ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన నవ వరుడు యామక గౌరీశంకర్‌ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సరస్వతి ప్రియుడు మడ్డు శివ అలియాస్‌ ఆది పోలీసులకు పట్టుబడటంతో నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. తాళి కట్టిన భర్తతో పడక సుఖం పొందలేక పోతున్నానంటూ తనతో వాపోయిందని, దీంతో తన సరస్వతి చెప్పినట్టుగానే చంపేసినట్టు ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన మడ్డు శివ వెల్లడించాడు.
knife
 
ఈ నెల 7న గరుగుబిల్లి మండలం ఐటీడీఏ పార్కు సమీపంలో నవ వరుడు గౌరీశంకర్‌ హత్యకు గురయ్యాడు. ఇందులో ఆయన భార్య సరస్వతితో పాటు విశాఖపట్నంకు చెందిన మరో నలుగురి (సుపారి గ్యాంగ్‌)ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా ప్రధాన సూత్రధారి సరస్వతి ప్రియుడు శివను కూడా అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన వద్ద జరిపిన విచారణలో నివ్వెరపరిచే నిజాలు వెల్లడయ్యాయి. 
 
లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్లకు దూరమైపోతాం.. పైగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని, గౌరీశంకర్‌నే అడ్డు తొలగిస్తే సరిపోతుందని సరస్వతి చెప్పినట్టు తెలిపారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపి మనమే చంపించేసి ఆ నెపం దారిదోపిడీ దొంగలపై తోసేస్తే అందరూ నమ్మేస్తారని ఐడియా ఇచ్చింది. అందుకు అనువైన ప్రదేశం తోటపల్లి జలాశయానికి వెళ్లే నిర్మానుష్య ప్రాంతమైతే బాగుంటుందనుకుని అనుకున్నాం. హత్య అనంతరం కొద్ది రోజుల తర్వాత మానవతా హృదయంతో వితంతువును వివాహమాడటానికి వచ్చిన యుగ పురుషుడుగా మా ఇంటికి వస్తావు అని సరస్వతి చెప్పిని శివ వివరించారు. 
 
ఇంట్లో వారిని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పిస్తావు, పైగా ఇద్దరిది ఒకే కులం కాబట్టి, బాధల్లో ఉన్నందున అడ్డు చెప్పే పరిస్థితి ఉండదని తనకు వివరించిందని శివ పోలీసులకు చెప్పాడు. అయితే, వాస్తవానికి గౌరీశంకర్‌ను బెంగుళూరులో ఉంటుండగానే చంపేయాలని తొలుత భావించామన్నారు. అక్కడైతే ఎవరికీ ఎటువంటి అనుమానం రాదన్న ఆలోచనతో బెంగుళూరులో ఒక ముఠాకు రూ.25 వేలు డబ్బులు అడ్వాన్సుగా ఇచ్చినట్టు తెలిపారు. 
 
దీంతో కిరాయి ముఠాను సంప్రదించారు. ఆ తర్వాత బెంగుళూరులో హత్య చేద్దామని ప్రయత్నించినా కుదరకపోవడంతో శ్రీకాకుళంగాని, విజయనగరంలోగాని లేపేస్తామని ముఠా హామీ ఇచ్చింది. తీరా వాళ్లు వారి ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసేయడంతో, విశాఖపట్నంలో మరో గ్యాంగ్‌ను కలిసి వారితో పథకాన్ని అమలు చేసినట్టు మడ్డు శివ పూసగుచ్చినట్టు వివరించాడు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హవాలా రాణి అరెస్ట్.. అందాన్ని ఎరగా వేసింది.. ఆ ఫోన్ కాల్ వైరల్

సోషల్ మీడియాలో ఓ హవాలా రాణి మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. హవాలా రాణిగా ...

news

కాలినడకన తిరుమలకు పవన్.. మదర్స్ డే విశిష్టత గురించి పవర్ స్టార్ ఏమన్నారంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాలినడకన తిరుమల కొండలెక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ...

news

తమిళనాడు కాబోయే సీఎం రజనీకాంతే.. పార్టీల్లో వణుకు.. సయోధ్యకు బీజేపీ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోనే కాదు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ ...

news

షాక్... ఏపిలో 13 ఏళ్ల బాలుడితో 23 ఏళ్ల యువతికి పెళ్లి... ఎందుకో తెలుసా?

తనకు జబ్బు చేసింది. భర్త రోజూ పీకల దాకా మద్యం సేవిస్తుంటాడు. తాము ఏ క్షణంలోనైనా ...

Widgets Magazine