Widgets Magazine

షాక్... ఏపిలో 13 ఏళ్ల బాలుడితో 23 ఏళ్ల యువతికి పెళ్లి... ఎందుకో తెలుసా?

ఆదివారం, 13 మే 2018 (16:18 IST)

తనకు జబ్బు చేసింది. భర్త రోజూ పీకల దాకా మద్యం సేవిస్తుంటాడు. తాము ఏ క్షణంలోనైనా పోవచ్చునని తలపోసిందా తల్లి. దీనికి పరిష్కార మార్గంగా తన 13 ఏళ్ల పెద్ద కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించుంది. అలా చేస్తే తన కుటుంబ భారం అంతా కాస్తాకూస్తో వారే చూసుకోగలుగుతారని అనుకుంది. ఐతే బాలుడికి మరో బాలికను ఇచ్చి చేస్తే ఇబ్బంది కనుక తన 13 ఏళ్ల బాలుడికి ప్రౌఢ యువతికిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యింది. అంతే... అనుకున్నదే తడవుగా అమ్మాయిని చూడటం పెళ్లి చేసేయడం జరిగిపోయింది. వారి పెళ్లికి సంబంధించిన ఫోటో బయటకు రావడంతో వ్యవహారం వైరల్ అయ్యింది. 
child-marriage
 
మరింత లోతుగా వెళితే... కర్నూలు జిల్లా ఉప్పరాహల్ గ్రామానికి చెందిన మహిళ తన భర్త తాగుబోతు కావడంతోనూ, తను అనారోగ్యం పాలుకావడంతోనూ ఇంటి బాధ్యతను చూసుకునేందుకు కొడుక్కి పెళ్లి చేయాలనుకుంది. కుమారుడి వయసు 13 ఏళ్లే. ఈ వయసులో అతడికంటే చిన్న వయసు బాలికను చేస్తే ఇద్దరూ అనాధలవుతారని భావించి తన కుమారుడికంటే వయసులో పెద్ద అమ్మాయి కావాలని వెతికింది. 
 
వెతకబోతుంటే కాలికి తగిలిందన్న చందంగా బళ్లారికి చెందిన 23 ఏళ్ల యువతికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు కర్నాలుకు వచ్చారు. దాంతో తన పరిస్థితిని వారికి వివరించి తన కుమారుడికి అమ్మాయిని ఇవ్వమని కోరింది. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని గత నెల సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించేశారు. 
 
ఆ ఫోటోలు అలాఅలా అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో బాల్య వివాహం నేరం కనుక అధికారులు హుటాహుటిని సదరు ఇంటికి వెళ్లారు. ఐతే ఇల్లు తాళం వేసి వుంది. వారంతా ఎటో వెళ్లిపోయినట్లు ఇరుగుపొరుగు చెప్పారు. మరో రెండ్రోజుల్లో ఆయా కుటుంబాలు, పెళ్లి చేసుకున్న జంట తమ ముందుకు రాకపోతే కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కిడ్నీ తీసుకున్నాడు.. ఇల్లు.. రూ.20లక్షలిస్తానని మోసం చేశాడు.. బాలాజీపై కేసు

సినీ, బుల్లితెర నటుడు బాలాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ను ...

news

బస్సులో హస్తప్రయోగం చేసిన వ్యక్తి... వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మహిళలు

కోల్‌కతా పోలీసులు తమ ఫేస్ బుక్ పేజీలో ఓ కంప్లైంటును చూసి షాక్ తిన్నారు. దానికి కారణం ...

news

కూల్... వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి... కాంగ్రెస్ కార్యకర్తలకు సిద్ధ పిలుపు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే నరాలు తెగే ఉత్కంఠ ...

news

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ.. సంప్రదాయానికి విరుద్ధంగా..

సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీ నారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. బీజేపీ ...

Widgets Magazine