Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాతృదేవోభవా... #MothersDay గురించి....

బుధవారం, 9 మే 2018 (18:53 IST)

Widgets Magazine

మాతృదేవోభవా, పితృదేవోభవా, ఆచార్య దేవోభవా అంటూ తొలిపదం తల్లికే ఇచ్చారు. అమ్మా, నాన్నను సమానంగా సృష్టించినా ప్రేమను వెలకట్టలేము. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా, ఏ దేశమేగినా, ఎక్కడ ఉన్నా అమ్మ ప్రేమలో మార్పు ఉండదు.


తన ఆయువునే ఆరోప్రాణంగా మలచి జన్మనిచ్చి, పసి వయస్సులో తొలిపరచియమై బుడిబుడి నడకలు నేర్పి, మమకారం ఆత్మీయతను పంచుతూ, గోరుముద్దలు తినిపిస్తూ అన్నీ తానై ప్రేమకు ప్రతిరూపంగా నిలిస్తున్న అమ్మ రుణం తీర్చుకోలేనిది. ముఖ్యంగా టీనేజ్ వయస్సులోని పిల్లలతో తల్లి స్నేహంగా ఉంటూ వారికి ఏమి కావాలో తెలుసుకుని అన్నీ తానై వారి భవిష్యత్‌కు బంగారుబాటలు వేస్తుంది. 
 
ఇందులో అమ్మ పాత్ర మరువలేనిది. అందుకే అమ్మకు కూడా ఒక పండుగను నిర్వహించుకునేందుకు గాను ప్రతి మే నెల రెండో ఆదివారిం ప్రపంచ వ్యాప్తంగా మదర్స్‌ డేను నిర్వహిస్తున్నారు. గ్లోబలీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో మదర్స్‌డే ప్రాముఖ్యత పెరిగిపోయింది.

మదర్స్‌ డే గురించి పలు వెబ్‌సైట్లలో, అన్ని భాషల్లో ఎన్నో వేల కొటేషన్లు దర్శనమిస్తున్నాయి. మదర్స్‌ డే రోజున పిల్లలు తమ తల్లికి అందమైన గ్రీటింగ్‌ కార్డులు, పలు రకాల బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వంద సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ మదర్స్‌ డే ప్రాముఖ్యం పట్టణాల నుండి ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి విస్తరిస్తోంది. మదర్స్‌ డే రోజున పిల్లలు తమ తల్లితండ్రులతో కలసి విందులు, వినోదాలు చేసుకోవడం, బహుమతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారింది. 
 
ప్రపంచమే కుగ్రామమైన ఈ రోజుల్లో మదర్స్‌ డేను కార్పొరేట్‌ సంస్థలు కమర్షియల్‌గా మార్చివేశాయి. మదర్స్‌ డే సందర్భంగా భారీ స్థాయిలో పిల్లలు తమ తల్లులకు పెద్దపెద్ద బహుమతులను అందిస్తున్నట్లుగా టీవి, యాప్స్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తూ సామాన్య పిల్లలకు కూడా తమ తల్లులకు అదే స్థాయిలో బహుమతులను అందించాలనే ఆలోచనలు రేకితిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
అమ్మ ప్రపంచం ప్రేమ బహుమతులు Mother World Love Years Rural Areas Greating Cards

Loading comments ...

మహిళ

news

మదర్స్‌ డే... 'అమ్మ'కు ఏం బహుమతి ఇవ్వాలి?

మే నెల రెండో ఆదివారం జరిగే వేడుకే అమ్మల పండగ. ఈ రూపంలో ఇది కొత్తదే గాని క్రీస్తు పూర్వం ...

news

సౌందర్య చిట్కాలు.. ఉప్పు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే?

ఒక స్పూన్ ఉప్పులో చెంచా రోజ్ వాటర్ కలిపి, అది కరిగిన వెంటనే ముఖానికి రాసుకోవాలి. ...

news

రుతుక్రమ సమస్యలను తొలగించే అంజీర..

అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీరను నిలువ చేసుకుని వాడుకోవచ్చు. ఇది ...

news

ఆషిమా నార్వల్ ఎవరో తెలుసా? మోడల్, యాక్టరే కాదు.. ఆర్టిస్ట్ కూడా?

ఆషిమా నార్వల్. ఈమె సిడ్నీ మోడల్, నటీమణి కూడా అయిన ఈమె 2015లో మోడలింగ్ రంగంలో కాలుమోపింది. ...

Widgets Magazine