శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (12:28 IST)

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి

జాతీయ పతాక రూపశిల్పి  శ్రీ పింగళి వెంకయ్య కావడం మన తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. ఆగస్టు 2 ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించారు  పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ సీఈవో జంగా శ్రీనివాస్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జాతీయ జెండా తయారు చేసిన తెలుగు వాడి గొప్పతనాన్ని  కీర్తిస్తూ వాడవాడలా ఆయన జయంతి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన జయంతి ఆగస్టు 2  మరియు వర్ధంతి  జులై 4లను జాతీయ పర్వదినాలుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పింగళి వెంకయ్య గారికి భారతరత్న ప్రకటించాలి అని జంగా శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు.