శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (20:30 IST)

నవంబర్‌ 8 నుంచి భవానీల మాలధారణ

భవానీల మాలధారణ కార్యక్రమం నవంబర్‌ 8 నుంచి ప్రారంభమవుతుందని దుర్గగుడి ఇ.ఒ. సురేశ్‌ కుమార్‌ చెప్పారు. డిసెంబర్‌ 18 నుంచి 22 వరకూ భవానీల దీక్ష విరమణ ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఏడాది కనీసం 5 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశామన్నారు. దసరా ఉత్సవాల్లో దుర్గ గుడికి 13.67 కోట్ల రూపాయిల ఆదాయం లభించిందని ఆయన అన్నారు.
జాతీయ సఫాయి కర్మాచారిస్ చైర్ పర్సన్ మన్హర్ వల్జిభాయ్ జాల గారు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరము సఫాయి కర్మాచారిస్ చైర్ పర్సన్ మన్హర్ వల్జిభాయ్ జాలకి వేదపండితులు వేదాశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదము, చిత్రపటమును అందజేసినారు.