శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (18:39 IST)

ప్రేమ కోసం ఇంజినీరింగ్ విద్యార్థుల దాడి.. ఐరన్ బాక్స్‌తో ఛాతీపై వాతలు!

Love
కాలేజీ రోజుల్లో ర్యాంగింగ్, ఫైటింగ్, ప్రేమ మామూలే. కాలేజీ స్టూడెంట్స్ అయితే ప్రేమ కోసం సినీ ఫక్కీలో అమ్మాయిల వెంటపడుతుంటారు. ఆపై ప్రేమ సక్సెస్ అయితే పండగ చేసుకుంటారు. అదే విఫలమైతే దేవదాసుల్లా తిరుగుతుంటారు కొందరు. 
 
అయితే ప్రేమ వ్యవహారంలో ఇంజినీరింగ్ విద్యార్థులు రెచ్చిపోయారు. తోటి విద్యార్థిని విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. 
 
అంకిత్ అనే విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఐరన్ బాక్స్‌తో ఛాతీపై వాతలు పెట్టారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన నలుగురు విద్యార్థులు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.