అఖిల ప్రియకు హ్యాండిచ్చిన చంద్రబాబు? జగన్ - పవన్‌ల వైపు చూపు

Akhila Priya
Last Updated: గురువారం, 10 జనవరి 2019 (15:09 IST)
భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా అఖిలప్రియా రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అయితే, ఈమె అధికార పార్టీలో మంత్రిగా ఉన్నారేగానీ, తన అనుచరుల అరెస్టులను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన సంజీవ నాయుడిని అరెస్టు చేసి పీడీయాక్ట్ ప్రయోగించారు.

ఈ చర్యతో ఆమె తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. దీంతో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించివేశారు. అదేసమయంలో కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనగా, ఈ కార్యక్రమానికి అఖిల ప్రియా హాజరుకాలేదు. దీంతో ఆమె పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.

నిజానికి భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తర్వాత భూమా అఖిల ప్రియా రెడ్డిని తన మంత్రివర్గంలోకి చంద్రబాబు తీసుకున్నారు. అంతేనా, తన సోదరుడుకి నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వగా, ఆయన కూడా టీడీపీ తరపున గెలుపొందారు. పైగా, తల్లిదండ్రులను కోల్పోయిన భూమా అఖిల ప్రియా రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్‌లు హామీ ఇచ్చారు. కానీ, ఇపుడు అఖిల ప్రియాకు పొమ్మనకుండా పొగబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.దీనిపై మరింత చదవండి :