సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (14:01 IST)

దిక్కుతోచని స్థితిలో బుట్టా రేణుక... సీటు కోసం బాబుకు వినతులు

గత లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై తెలుగుదేశం పార్టీలో చేరిన ఎంపీల్లో బుట్ట రేణుక ఒకరు. ఈమె తన ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే తెలుగుదేశం పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పైగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆమె భావించారు. కానీ, ఆమె కల సాకారమయ్యేలా కనిపించడం లేదు. 
 
నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆమె కర్నూలు లోక్‌సభ స్థానుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కనీ, అక్కడ నుంచి మరొకరిని బరిలోకి దించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కర్నూలు లోక్‌సభ స్థానం టిక్కెట్ తనకు కేటాయించి న్యాయం చేయాలని సీఎం చంద్రబబును కోరారు. 
 
గురువారం భర్త నీలకంఠతో కలిసి ఆమె సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ ఎన్నికల్లోనూ తనకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. మీకు సముచిత న్యాయం చేస్తాం.. నాలుగు రోజుల్లో నిర్ణయం చెబుతామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. 
 
కాగా, 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆమెకే ఎంపీ టికెట్‌ ఖరారు అని ప్రచారం సాగింది. గత నెల 19న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ నెల 2న కోడుమూరు సభలో సీఎం సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరుతున్నారు.
 
కర్నూలు ఎంపీ టికెట్‌ కోట్లకు ఖరారు చేసినట్లు తెలిసిందే. పార్టీలో చేరినప్పుడు టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి..? న్యాయం చేయాలని బుట్టా రేణుక సీఎంను కోరినట్లు సమాచారం. ఎంపీ టికెట్‌ ఇవ్వకపోతే ఆదోని అసెంబ్లీ స్థానం నుంచి బుట్టా రేణుకను బరిలో దింపే అవకాశం ఉందని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
చంద్రబాబును కలిసిన తర్వాత ఆమె మాట్లాడుతూ, తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆసక్తి లేదని, ఎంపీగానే అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్టు చెప్పారు. నాలుగైదు రోజుల్లోగా నిర్ణయం చెబుతామని సీఎం వివరించారని తెలిపారు. ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో రాజ్యసభకు పంపుతారా?, ఆదోని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.