పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు వేస్తారా? : అమిత్ షా ఫైర్

శుక్రవారం, 13 జులై 2018 (16:32 IST)

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్లపాటు నగర బహిష్కరణవేటు వేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా ఆయన హోటల్‌కు వెళ్లి బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు.
amit shah
 
ఈ సందర్భంగా వారు పరిపూర్ణానంద వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అపుడు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందువులంతా ఏకమై స్వామిజీకి పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపు నిచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనక్కి తగ్గవద్దని కోరినట్టు సమాచారం. 
 
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విమర్శకుడు కత్తి మహేశ్‌ను శిక్షించకుండా, పరిపూర్ణానందను ఏ విధంగా నగర బహిష్కరణ చేస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలతో పాటు, 2019 ఎన్నికల నిమిత్తం ఏర్పాటైన కమిటీ ప్రత్యేక సమావేశంలో కూడా పాల్గొంటారు. దీనిపై మరింత చదవండి :  
అమిత్ షా స్వామి పరిపూర్ణానంద బహిష్కరణ మండిపాటు Bjp Expelled బీజేపీ Swamy Paripoornananda Amit Shah

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్‌ కళ్యాణ్ కంటికి ఆపరేషన్... రేణూ ఆరా తీసిందా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ...

news

రమణ దీక్షితులకు షాకిచ్చిన కేంద్రం.. అక్కడే చర్చించుకోవాలని లేఖ..

అర్చకులకు 65 ఏళ్ల నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తీసుకురావడంతో శ్రీవారి ...

news

అప్పుడు సైకిళ్లకు పంక్చర్లు.. ఇప్పుడు రూ.150 కోట్ల ఆస్తులు.. ఎలా?

'ఇచ్చట సైకిళ్లకు పంక్చర్లు వేయబడును - సైకిళ్లు అద్దెకు ఇవ్వబడును' అనే బోర్డు పెట్టుకుని, ...

news

యజమానురాలుని ట్రాప్ చేసిన కారు డ్రైవర్... ఇంటికి తీసుకెళ్లి అనుభవించి...

కరీంనగర్‌ విద్యానగర్‌కు చెందిన 38 ఏళ్ల వివాహిత భర్తతో విడాకులు తీసుకుని కరీంనగర్‌లో ...