మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 మార్చి 2021 (22:18 IST)

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు భాజపా-జనసేన తమ ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా రత్నప్రభను గెలిపించాల్సిందిగా కోరారు.
 
''తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బిజెపి - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి రత్న ప్రభ గారికి శుభాకాంక్షలు. ప్రజా జీవితంలోనే కొనసాగిన వారి యొక్క సుదీర్ఘ పరిపాలనా అనుభవం, ప్రజలకు సేవలందించటానికి ఆమెను అత్యుత్తమమైన అభ్యర్థిగా నిలబెడుతుంది.
 
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, ఆమెను గెలిపించి, వారి యొక్క విలువైన సేవలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.'' అని ట్వీట్ చేశారు.