Widgets Magazine

పోలీస్ పెట్రోలింగ్ వాహనం సైరన్ విని మృత్యువాత.. ఎలా?

బుధవారం, 6 జూన్ 2018 (15:27 IST)

పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్ విని ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. అదేంటి.. సైరన్ విని ఎలా చనిపోయారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్‌ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొలాల పక్కన బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు.
police vehicle siren
 
ఇంతలో అటుగా పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఆ వాహనం సైరన్ చప్పుడు విని శ్రావణ్‌తో పాటు స్నేహితులంతా తలో దిక్కుకు పరుగులు తీశారు. చీకట్లో వ్యవసాయ బావిని గమనించక శ్రావణ్ అందులో పడిపోయాడు. శ్రావణ్ కోసం అతడి స్నేహితులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు పట్టుకెళ్లి ఉంటారని అందరూ భావించారు. ఇదే విషయంపై బుధవారం ఉదయం వెళ్లి విచారించగా తాము తీసుకురాలేదని పోలీసులు సమాధానం చెప్పారు. 
 
దీంతో మరోసారి శ్రావణ్ కోసం మొగ్దుంపూర్ వైన్స్ పరిసరాల్లో గాలించారు. ఈ గాలింపులో ఓ బావిలో శ్రావణ్ మృతదేహం కనిపించింది. శ్రావణ్ మరణ వార్తతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే.. పోలీసు పెట్రోలింగ్ భయంతో కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఇప్పటివరకు ముగ్గురు వేర్వేరు ఘటనల్లో బావుల్లో పడి చనిపోవడం గమనార్హం. 
 
కాగా, మృతుని స్వస్థలం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్. స్థానిక నిగమ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుకుంటూ మొగ్దుంపూర్ హాస్టల్లో ఉంటున్నాడు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబా వార్నింగ్‌కు దిగివచ్చిన యోగి.. బాబ్బాబూ.. ప్లీజ్ అంటూ...

యోగా గురువు రాందేవ్ బాబా వార్నింగ్‌కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ...

news

అదే జరిగితే ఉరివేసుకుంటా : ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకుంటుందంటూ ...

news

ఆడశిశువు పుట్టిందని.. ముళ్లపొదలో పారేశారు.. నాచారంలో?

ఆడశిశువు పుట్టిందని ఆ శిశువు తల్లితండ్రులు పసికందును ముళ్లపాలు చేశారు. ఈ ఘటన నాచారంలో ...

news

ఆమోదముద్ర వేయాలంటే రీ-కన్ఫర్మేషన్ లేఖ ఇవ్వండి.. షాక్‌తిన్న వైకాపా ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ ...

Widgets Magazine